‘పుట్టినరోజు నాడు ప్రాణాలతో బయటపడ్డా’: బస్సు ప్రమాద బాధితుడు

by Gantepaka Srikanth |

కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం(Bus Accident)లో దాదాపు 20 మందికి పైగా ప్రయాణికులు మృతిచెందిన విషయం తెలిసిందే.

‘పుట్టినరోజు నాడు ప్రాణాలతో బయటపడ్డా’: బస్సు ప్రమాద బాధితుడు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం(Bus Accident)లో దాదాపు 20 మందికి పైగా ప్రయాణికులు మృతిచెందిన విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్ బస్సు.. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలో బస్సులో మంటలు చెలరేగి 20 మందికి పైగా మరణించారు. ప్రమాదాన్ని గమనించిన వెంటనే కొందరు ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకోవడం కోసం బస్సు అద్దాలు పగులకొట్టి బయటకు దూకారు. ఈ క్రమంలో గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే.. గాయాలతో బయటపడిన ఓ బాధితుడు రామిరెడ్డి మీడియాతో మీడియాతో మాట్లాడారు. ‘పుట్టినరోజు నాడు ప్రాణాలతో బయటపడ్డాను. దేవుడు నాకు పునర్జన్మ ప్రసాదించాడు అనుకుంటాను. ఇలాంటి ప్రమాదాలు జరుగకూడదు.. ప్రత్యక్షంగా చూడకూడదు. నేను గాఢ నిద్రలో ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు. బస్సులో మంటలు, నల్లని పొగ దట్టంగా వ్యాపించాయి. నేను నిద్ర లేచేసరికి కొందరు ఎమర్జెన్సీ డోర్ బద్దలు కొడుతున్నారు. అందులో నుంచి కొందరు బయటకు వెళ్లారు. వారితో పాటే నేనూ బయటకు వచ్చాను. బస్సులో నాది చివరి సీటు కావడంతో ప్రాణాలతో బయటపడ్డాను’ అని ప్రయాణికుడు రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

Next Story