అదనపుకట్నం కోసం గుండు కొట్టించి చిత్రహింసలు..బిడ్డను చంపి మహిళ ఆత్మహత్య

by Ajay Maddhiboyina |

అద‌న‌పు క‌ట్నం కోసం వేధింపుల‌కు గురి చేయ‌డంతో యూఏఈ (యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్)లో కేర‌ళ‌కు చెందిన మ‌హిళ త‌న కూమార్తెను చంపి తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

అదనపుకట్నం కోసం గుండు కొట్టించి చిత్రహింసలు..బిడ్డను చంపి మహిళ ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: అద‌న‌పు క‌ట్నం కోసం వేధింపుల‌కు గురి చేయ‌డంతో యూఏఈ (యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్)లో కేర‌ళ‌కు చెందిన మ‌హిళ త‌న కూమార్తెను చంపి తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంది. జూలై 8న షార్జాలోని అల్ స‌హ్దాలో 32ఏళ్ల విపంజిక అనే మ‌హిళ త‌న ఏడాదిన్న‌ర కుమార్తె వైభ‌విని చంపి తాను ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఆత్మ‌హ‌త్య‌కు ముందు విపంజిక త‌న అత్తింటి కుటుంబం అద‌న‌పు క‌ట్నం కోసం వేధింపుల‌కు గురి చేస్తోంద‌ని ఆరోపిస్తూ ఫేస్ బుక్‌లో సూసైడ్ నోట్ రాసింది. అందులో సంచలన విషయాలు రాసుకొచ్చింది. తన భర్త తండ్రి అసభ్యంగా ప్రవర్తించేవాడని, ఆ విషయాన్ని భర్త నిధీష్‌కు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

తన భర్త అసభ్యకర వీడియోలు చూస్తూ అలా తనను చేయాలని హింసించేవాడని పేర్కొంది. తనను కుక్కలా చూస్తున్నారని, కొడుతూ దారుణంగా హింసించారని సూసైడ్ నోట్ లో పేర్కొంది. ఇక తాను భరించలేనని వాళ్లను వదిలిపెట్టవద్దని కోరింది. విపరంజిక సూసైడ్ నోట్ ఆధారంగా ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నింధితుడిగా విపంజిక భర్త నిధీష్ తో పాటు అతడి సోదరి నీతు, తండ్రిపై కేసు నమోదు చేశారు.

కట్నం కోసం విపంజికను శారీరకంగా, మానసికంగా వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ ఘటనలో విపంజిక తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. విపంజిక అత్తింటి వారు తన కుమార్తెకు గుండు కొట్టించి వేధించారని చెప్పారు. వాళ్ల కుటుంబంలో అంతా నల్లగా ఉంటారని, తన కూతురు కూడా అందంగా కనిపించకూడదు అని గుండు కొట్టించారని చెప్పారు. భర్త విధీష్ కుటుంబం వల్ల తన కుమార్తె ఎన్నో కష్టాలను ఎదుర్కొంది అని వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Next Story