- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘వందేభారత్’లో ఎక్స్పైర్ అయిన కూల్‌డ్రింక్స్.. హెచ్‌ఆర్‌సీ నోటీసులు
వందేభారత్.. ప్రయాణికుల జర్నీ టైమ్‌ను తగ్గించి.. త్వరగా గమ్య స్థానాలకు చేరుస్తోంది. తాజాగా వందేభారత్ రైలులో ఎక్స్పైర్ అయిన కూల్ డ్రింక్స్ సప్లై చేయడంపై మీడియాలో వార్తలు రావడంతో మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది.

దిశ, వెబ్‌డెస్క్: వందేభారత్.. ప్రయాణికుల జర్నీ టైమ్‌ను తగ్గించి.. త్వరగా గమ్య స్థానాలకు చేరుస్తోంది. తాజాగా వందేభారత్ రైలులో ఎక్స్పైర్ అయిన కూల్ డ్రింక్స్ సప్లై చేయడంపై మీడియాలో వార్తలు రావడంతో మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. మే 30వ తేదీన మంగళూరు నుంచి తిరువనంతపురం (Mangaluru to Tiruvananthapuram) వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైల్లో ప్యాసింజర్లకు కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ ఇచ్చినట్లు నివేదికలు రావడంతో కేరళ మానవ హక్కుల కమిషన్ (Kerala HRC) కేసు నమోదు చేసింది.
ఈ ఘటనపై 15 రోజుల్లోగా దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని పాలక్కాడ్‌లోని డివిజినల్ రైల్వే మేనేజర్‌కు నోటీసులు జారీ చేసింది. వందేభారత్‌లో ప్రయాణికులకు ఇచ్చిన కూల్‌డ్రింక్స్ బాటిల్స్‌పై సెప్టెంబర్ 25, 2024న తయారు చేసి, మార్చి 24, 2024 వరకు గడువు తీరిందని రాసి ఉన్నట్లు మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై ప్రయాణికులు క్యాటరింగ్ సిబ్బందిని ప్రశ్నించినా వాళ్లు పట్టించుకోలేదని నివేదికలు తెలిపారు. తాజాగా దీనిపై కేరళ మానవహక్కుల కమిషన్ జ్యుడీషియల్ సభ్యుడు కె. బైజునాథ్ దర్యాప్తుకు ఆదేశించారు. జూన్ 26న ఈ కేసు కోజికోడ్ లోని ప్రభుత్వ అతిథిగృహంలో విచారణకు రానుండగా.. 15 రోజుల్లో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని డిఆర్ఎంను ఆదేశించారు.






