- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kedar: కేదార్ మృతిపై దుబాయ్ పోలీసుల క్లీన్‌చిట్.. అంత్యక్రియలు పూర్తి
ప్రముఖ సినీ నిర్మాత సెలగంశెట్టి కేదార్ (Selagamshetty Kedar) మృతిపై ఎట్టకేలకు అనుమానాలు వీడాయి.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నిర్మాత సెలగంశెట్టి కేదార్ (Selagamshetty Kedar) మృతిపై ఎట్టకేలకు అనుమానాలు వీడాయి. ఈ మేరకు ఆయనది సహజ మరణమేనని, ఎలాంటి కుట్రలు లేవంటూ దుబాయ్ (Dubai) పోలీసులు పోస్ట్‌మార్టం రిపోర్టు (Postmortem Report)లో వెల్లడించారు. అనంతరం కేదార్ మృతదేహాన్ని భార్య రేఖా వీణ (Rekha Veena)కు అప్పగించారు. భారత ప్రభుత్వ (Indian Government) అనుమతితో ఆయన భార్య, కుటుంబ సభ్యులు దుబాయ్‌లోనే అంత్యక్రియలు (Funeral) నిర్వహించారు. అయితే, డెడ్‌బాడీ (Deadbody)ని భారత్‌కు తీసుకెళ్తే ఇబ్బందులు ఎదురవుతాయని, కుటుంబంలో అందరిని నిర్ణయం మేరకు దుబాయ్ (Dubai)లోనే దహన సంస్కారలు నిర్వహించినట్లుగా భార్య రేఖా వీణి పేర్కొన్నారు. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, సినీ ప్రముఖులకు బినామీగా కేదార్ ఉన్నట్లుగా జోరుగా పుకార్లు షికారు చేశాయి. వారికి సంబంధించిన రూ.100 కోట్లు ఆయన వద్ద భద్రంగా ఉన్నట్లుగా సమాచారం. అదే డబ్బుతో దుబాయ్‌ని కేంద్రంగా చేసుకుని కేదార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన్నట్లుగా తెలుస్తోంది.
కాగా, నిర్మాత కేదార్ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. దుబాయ్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) బిజినెస్ పార్ట్‌నర్ ఫ్రెండ్ కేదార్ ఆకస్మిక మరణానికి కారణం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదన్నారు. రాడిసన్ కేసులో కేదార్ నిందితుడుగా ఉన్నారని రేవంత్ తెలిపారు. కొంత కాలంగా కేసులతో సంబంధం ఉన్నవారు వరుసగా చనిపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పిటిషన్ వేసిన సంజీవరెడ్డి (Sanjeeva Reddy)తో పాటు ఆ వెంటనే రాజలింగం (Rajalingam), కేదార్ (Kedar) వరుస మరణాలపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈ విషయంలో తమకు ఫిర్యాదులు అందితే సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తామని సీఎం రేవంత్ మీడియాతో చిట్‌చాట్‌లో ఉన్నారు.






