గంటలోనే దొంగను పట్టుకున్న పోలీసులు..

by Bhanu |

కేసముద్రం మండలంలోని కల్వల గ్రామానికి చెందిన బొడ్డు వెంకటమ్మ శుక్రవారం పొలం పనుల నిమిత్తం బావి దగ్గరికి వెళ్లుతోంది.

గంటలోనే దొంగను పట్టుకున్న పోలీసులు..
X

దిశ, కేసముద్రం: కేసముద్రం మండలంలోని కల్వల గ్రామానికి చెందిన బొడ్డు వెంకటమ్మ శుక్రవారం పొలం పనుల నిమిత్తం బావి దగ్గరికి వెళ్లుతోంది. ఈక్రమంలో మార్గమధ్యంలో ఇద్దరు దొంగలు ఆమెను అడ్డగించి మెడలో ధరించిన రెండు తులాల బంగారు పుస్తెల తాడును దౌర్జన్యంగా లాక్కొని పారిపోయారు.

సమాచారం అందుకున్న కేసముద్రం పోలీసులు చాకచక్యంగా స్పందించి దొంగలను ఆలేరు సమీపంలో అరెస్ట్ చేశారు. ఈ దొంగలను కేవలం గంట వ్యవధిలో పట్టుకున్న పోలీసుల తక్షణ చర్య ప్రజల్లో ప్రశంసలు అందుకుంటోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story