- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళకు ఎమ్మెల్యే పీఏ వేధింపులు.. నమ్మించి పెళ్లి చేసుకుని చివరికి!
ఉద్యోగం, డబ్బుల ఆశ చూపించి కడప ఎమ్మెల్యే పీఏ వాహిద్ ఓ మహిళను రెండో వివాహం చేసుకుని మోసం చేశాడు. దీంతో బాధితురాలు అతడిని శిక్షించాలని డిమాండ్ చేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఉద్యోగం, డబ్బుల ఆశ చూపించి కడప ఎమ్మెల్యే పీఏ వాహిద్ ఓ మహిళను రెండో వివాహం చేసుకుని మోసం చేశాడు. దీంతో బాధితురాలు అతడిని శిక్షించాలని డిమాండ్ చేస్తోంది.ఉద్యోగం, డబ్బు ఆశ చూపి పెళ్లి చేసుకున్నాడని ఇప్పుడు వేధింపులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరో ముగ్గురు యువతులను కూడా వాహిద్ ట్రాప్ చేశాడని ఆరోపిస్తోంది. తనతో కలిసి దిగిన పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడని బాధితురాలు చెబుతోంది.
నిలదీయడంతో ఫోన్ పోయిందని డ్రామాలు ఆడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. భర్తనే కదా అని ఫోటోలు దిగితే ఆ ఫోటోలు బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన కూతురుకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడని రూ.3.50వేలు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేశాడని చెప్పారు. న్యాయం చేయాలని డిమాండ్ చేసినందుకు తన కుటుంబ సభ్యులపై దాడి చేశాడని ఆరోపించారు. మరోవైపు ఇప్పటికే వాహిద్ ను ఎమ్మెల్యే ఉద్యోగం నుండి తొలగించినట్టు తెలుస్తోంది.






