మార్కెట్‌లో దారుణం.. వృద్ధుడి ప్రాణం ఖరీదు రూ.5.. మానవత్వానికి సిగ్గుచేటు

by Sujitha Rachapalli |

బీహార్ జెహానాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాకో బ్లాక్ మార్కెట్‌లో కూరగాయల వ్యాపారిని దారుణంగా హతమార్చారు. కేవలం ఐదు రూపాయల కోసం క్రూరంగా కొట్టి చంపేశారు. వివరాల్లోకి వెళ్తే.. మహమ్మద్ మొహ్సిన్ అనే వృద్ధుడు

మార్కెట్‌లో దారుణం.. వృద్ధుడి ప్రాణం ఖరీదు రూ.5.. మానవత్వానికి సిగ్గుచేటు
X

దిశ, వెబ్ డెస్క్: బీహార్ జెహానాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాకో బ్లాక్ మార్కెట్‌లో కూరగాయల వ్యాపారిని దారుణంగా హతమార్చారు. కేవలం ఐదు రూపాయల కోసం క్రూరంగా కొట్టి చంపేశారు. వివరాల్లోకి వెళ్తే.. మహమ్మద్ మొహ్సిన్ అనే వృద్ధుడు కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. రోజూ ఉదయాన్నే కూరగాయలు, పండ్లు తీసుకొచ్చి మార్కెట్‌లో అమ్మేవాడు. కానీ కొన్ని రోజులుగా అమ్మకాలు సరిగ్గా లేక డీలా పడ్డాడు. ఈ క్రమంలో మార్కెట్ కమిటీ ఫీజు కింద పదిహేను రూపాయలు డిమాండ్ చేయగా.. అతను పది రూపాయలు చెల్లిస్తానని చెప్పాడు. దీంతో వాదన జరగ్గా.. ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు విక్కీ పటేల్ అతనిని దారుణంగా కొట్టాడు. ప్రాణం పోయే వరకు బాదాడు.

ఇంత జరుగుతున్నా, జరిగినా ఏ ఒక్కరు కూడా వ్యతిరేకించేందుకు ముందుకు రాకపోగా.. యథావిధిగా వ్యాపారం చేసుకున్నారు. శవం అక్కడ ఉన్నా కూడా మార్కెట్ నార్మల్‌‌గానే నడిచింది. మొత్తానికి ఆ వృద్ధుడి ప్రాణం ఖరీదు కేవలం ఐదు రూపాయలుగా మిగిలిపోయింది. ఈ ఘటన మానవత్వానికి సిగ్గుచేటుగా మారింది.

Next Story