ఇంజక్షన్‌లో గడ్డిమందు వేసుకుని జూనియర్‌ డాక్టర్ మృతి

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-01-05 12:35:10  IST  )

గడ్డి మందు ఇంజక్షన్ చేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన జూనియర్‌ డాక్టర్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఇంజక్షన్‌లో గడ్డిమందు వేసుకుని జూనియర్‌ డాక్టర్ మృతి
X

దిశ, సిద్దిపేట అర్బన్ : గడ్డి మందు ఇంజక్షన్ చేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన జూనియర్‌ డాక్టర్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన బి. లావణ్య సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో హౌజ్‌ సర్జన్‌ పూర్తి చేసి ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్‌ చేస్తోంది. ఆమె లేబర్‌ రూంలో డ్యూటీలో ఉండగా.. అనారోగ్యంగా ఉండడంతో క్యాజువల్‌ డిపార్ట్‌మెంట్‌లో చికిత్స తీసుకొని కాలేజీ హాస్టల్‌కు వెళ్లింది. ప్రభుత్వ కళాశాల హాస్టల్‌లో పారాక్వాట్‌ గడ్డి మందును ఇంజెక్ట్‌ చేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన తోటి జూనియర్‌ డాక్టర్లు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇంటర్న్‌షిప్‌ డ్యూటీలకు నీట్‌ పీజీ ప్రిపరేషన్‌ ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడినట్టు మెడికల్‌ కాలేజీ సిబ్బంది చెబుతున్నారు. జూనియర్‌ డాక్టర్‌ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దిపేట త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం ఏమిట‌నేది మాత్రం పోలీసులు ధృవీక‌రించేందుకు నిరాక‌రించ‌డం గ‌మ‌నార్హం.

Next Story