- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jubilee Hills Robbery Case: మాస్టర్ మైండ్ భీమ్లా అరెస్ట్
జూబ్లీహిల్స్ చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ చోరీ కేసు(Jubilee Hills Robbery Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాస్టర్ మైండ్ భీమ్లాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నేపాల్ పారిపోతుండగా శనివారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బడాబాబులను టార్గెట్ చేస్తూ ముఠాలకు భీమ్లా సమాచారం ఇస్తున్నట్లు గుర్తించారు. భీమ్లాను పట్టుకోవడంతో నేపాలీ ముఠా డొంక కదులుతోంది. హైదరాబాద్‌లో నేపాలీలు చేసిన అనేక చోరీల్లో భీమ్లాదే కీలక పాత్ర అని ఇప్పటికే పోలీసులు గుర్తించారు.
కాగా, ఈనెల 5న జూబ్లీహిల్స్‌లోని నందగిరిహిల్స్‌లో వ్యాపారి రవీంద్రకుమార్ శర్మ ఇంట్లో రూ.1.31 కోట్ల విలువైన ఆభరణాల చోరీకి పాల్పడిన భూపేందర్ షాహీ, కృష్ణ చాంద్‌ను మూడురోజుల క్రితం నేపాల్ సరిహద్దు దాటుతున్న సమయంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన జబిన్ చాంద్, బీమ్లాలు ఇన్ని రోజులు తప్పించుకుని తిరిగారు. తాజాగా వీరిని పోలీసులు ఎట్టకేలకు పట్టేసుకున్నారు.






