మంత్రం.. తంత్రం.. అంటూ మహిళలపై మతగురువు దారుణాలు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు

by Sujitha Rachapalli |

రాజస్థాన్ జోధ్‌పూర్‌లో మదర్సా నిర్వహిస్తున్న మతగురువు మౌలానా అఫ్జల్ గురించి విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సంతానం కోసం వెళ్తున్న స్త్రీల బలహీనతలను క్యాష్ చేసుకుంటున్న ఈ మత పెద్ద.. మంత్రం..

మంత్రం..  తంత్రం.. అంటూ మహిళలపై మతగురువు దారుణాలు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు
X

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్ జోధ్‌పూర్‌లో మదర్సా నిర్వహిస్తున్న మతగురువు మౌలానా అఫ్జల్ గురించి విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సంతానం కోసం వెళ్తున్న స్త్రీల బలహీనతలను క్యాష్ చేసుకుంటున్న ఈ మత పెద్ద.. మంత్రం.. తంత్రం.. పేరుతో వారిని శారీరకంగా, లైంగింకంగా వేధిస్తున్నాడు. అశ్లీల చర్యలకు పాల్పడుతున్నాడు. అయితే ఇందుకు సంబంధించిన ఐదు వీడియోలు వైరల్ కావడంతో జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై దాడులకు సిద్ధమయ్యారు. అయితే ముందుగానే సమాచారం అందడంతో ఎస్కేప్ అయ్యాడు సదరు పెద్ద మనిషి. ఇంటికి, మదర్సాకు తాళం వేసి తప్పించుకున్నాడు. కాగా కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఇంకా ఎవరు ఫిర్యాదు చేయలేదని.. వైరల్ అయిన వీడియోల్లో ఉన్నది అతనేనా కాదా అనే స్పష్టత కూడా రావాల్సి ఉందన్నారు.

Next Story