సంచలనం.. IBOMMA రవికి సైబర్ క్రైంలో జాబ్ ఆఫర్?

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-12 15:14:38  IST  )

ఐబొమ్మ రవి విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. విచారణ సమయంలో రవికి పోలీసులు భారీ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేయాలని పోలీసులు అడిగినట్టు తెలుస్తోంది.

సంచలనం.. IBOMMA రవికి సైబర్ క్రైంలో జాబ్ ఆఫర్?
X

దిశ, వెబ్ డెస్క్: నాంపల్లి కోర్టులో మరోసారి ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ రోజే బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు సార్లు రవిని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. విచారణ సమయంలో రవికి పోలీసులు భారీ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేయాలని పోలీసులు అడిగినట్టు తెలుస్తోంది. కానీ రవి పోలీసుల ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారట.

అంతే కాకుండా ఇంతకాలం పైరసీ సినిమాలు చేస్తూ కాలం గడిపిన రవి కరేబియన్ దీవుల్లో తలదాచుకున్న సంగతి తెలిసిందే. కాగా తరవాత కూడా కరేబియన్ దీవులకు వెళ్లి ఐబొమ్మ పేరుతో రెస్టారెంట్ బిజినెస్ పెడతానని చెప్పినట్టు సమాచారం. అంతే కాకుండా ఐబొమ్మ ద్వారా రూ.17 కోట్లు సంపాదించి మొత్తం ఎంజాయ్ చేయడానికే ఖర్చు చేశానని చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు రవి అకౌంట్ లోని రూ.3 కోట్లను సీజ్ చేయగా తన భవిష్యత్ ప్రణాళికను వారికి వివరించినట్టు సమాచారం.

Next Story