తల్లిని హత్య చేసిన కొడుకు.. వాడిని ఉరి తీయాలని తండ్రి డిమాండ్..

by Sujitha Rachapalli |

రాజస్థాన్ జైపూర్‌లో నాలుగు రోజుల క్రితం కన్న తల్లిని దారుణంగా హత్య చేశాడు కొడుకు. గ్యాస్ సిలిండర్ తెమ్మని కోపంగా చెప్పినందుకు.. ముఖంపై గుద్దుతూ.. గొంతు నొక్కుతూ.. కర్రతో తలపై బాది..

తల్లిని హత్య చేసిన కొడుకు.. వాడిని ఉరి తీయాలని తండ్రి డిమాండ్..
X

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్ జైపూర్‌లో నాలుగు రోజుల క్రితం కన్న తల్లిని దారుణంగా హత్య చేశాడు కొడుకు. గ్యాస్ సిలిండర్ తెమ్మని కోపంగా చెప్పినందుకు.. ముఖంపై గుద్దుతూ.. గొంతు నొక్కుతూ.. కర్రతో తలపై బాది.. కిరాతకంగా హతమార్చాడు. తండ్రి అడ్డుకుంటున్నా ఆగకుండా క్రూరంగా ప్రవర్తించాడు. దీంతో కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయింది ఆ తల్లి. తన కుటుంబం నాశనమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తండ్రి.

తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని.. కొడుకు తాగుడుకు బానిసై ఆస్తి మొత్తం కరిగించాడని బాధపడ్డాడు. ఇలాంటి వాడిని ఉరి తీయాలని.. మీరు రాసే కథనంతోనైనా వాడికి ఉరి శిక్ష పడాలని.. ఓ జర్నలిస్ట్‌కు రిక్వెస్ట్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు కూడా అదే కోరుతున్నారు.

Next Story