- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్నారి కళ్లు కొట్టేసిన ఆస్పత్రి యాజమాన్యం
రాజస్థాన్ కరౌరి జిల్లా తోడభీమ్‌కు చెందిన పదేళ్ల సమర్ మీనా.. రోజూ మాదిరిగానే అందరు పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో సమర్ మీద సడెన్‌గా ఓ ఇనుప రేకు పడింది. తలకు పెద్ద గాయమైంది. పరిస్థితి విషమంగా ఉండగా.. వైద్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్ కరౌరి జిల్లా తోడభీమ్‌కు చెందిన పదేళ్ల సమర్ మీనా.. రోజూ మాదిరిగానే అందరు పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో సమర్ మీద సడెన్‌గా ఓ ఇనుప రేకు పడింది. తలకు పెద్ద గాయమైంది. పరిస్థితి విషమంగా ఉండగా.. వైద్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత జైపూర్‌కు తరలించారు. కానీ పిల్లాడు ఎలాగైనా బతికొస్తాడనే ఆశ కాస్త నిరాశగా మారింది. మార్గమధ్యంలోనే మరణించాడు. దీంతో గుండె ముక్కలు అయిపోయిన బాలుడి తండ్రి కిరోరి లాల్ మీనా.. మృతదేహంతో ఇంటికి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మదన్ మోహన్.. కిరోరికి ఫోన్ చేసి.. తను చెప్పినట్లు చేస్తే పిల్లాడు బతికి ఉండే చాన్స్ ఉందన్నారు. జైపూర్ ఉన్నత వైద్యులు పిల్లాడిని రక్షించగలరని హామీ ఇచ్చాడు. దీంతో బాలుడి మృతదేహాన్ని తీసుకుని మళ్లీ జైపూర్ చేరుకున్నారు.
అయితే ఆ తర్వాత అంత్యక్రియలు ఏర్పాటు చేస్తుండగా.. చిన్నారి రెండు కళ్లు కనిపించలేదు. దీంతో మదన్ మోహన్‌ను ప్రశ్నించగా.. చిన్నారి నేత్రాలు దానం చేయడం మంచిదని, అందుకే చేశానని చెప్పాడు. కుటుంబ అనుమతి తీసుకోకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదని వారించారు. ఇప్పటికే కేసు నమోదు కాగా మదన్ మోహన్ తప్పుదోవ పట్టిస్తూనే ఉన్నాడు. ఇక జైపూర్ SMS హాస్పిటల్ పోలీస్ స్టేషన్లో హ్యూమన్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు ఏఎస్ఐ సూరజ్మల్ తెలిపారు.






