- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జార్ఖండ్‌లో ఐసిస్ కదలికలు.. NIA అధికారుల మెరుపు సోదాలు
దేశంలో ఐసీస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న అనుమానితులపై ఎన్ఐఏ (NIA) ప్రధానంగా ఫోకస్ పెట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఐసీస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న అనుమానితులపై ఎన్ఐఏ (NIA) ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఐసిస్‌తో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న షానవాజ్ ఆలం (Shahnawaz Alam) ఇంటిపై ఇవాళ ఉదయం ఎన్‌ఐఏ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ సోదాల్లో ల్యాప్‌టాప్, ప్రింటర్‌తో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పరికరాలు ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించినట్లు ఎన్ఐఏ అనుమానిస్తుంది. అయితే, వాటిలో ఉన్న కంటెంట్‌పై ఎలాంటి అధకారిక ప్రకటన వెలువడలేదు. హజారీబాగ్‌కు చెందిన షానవాజ్ ఆలంను 2023 అక్టోబర్‌లో ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అరెస్టు చేసింది. 2019లో దోపిడీ, దొంగతనం కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన ఆలం 2020 డిసెంబర్‌లో బెయిల్‌పై బయటకు వచ్చాడు. బెయిల్ తర్వాత ఐసిస్ హ్యాండ్లర్లతో సంబంధాలు పెట్టుకుని పూణే ఐసిస్ మాడ్యూల్ కేసులో కీలక నిందితుడిగా మారాడు. ఎన్‌ఐఏ అరెస్టు చేసిన ఓ డాక్టర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఝార్ఖండ్‌లో కూడా షానవాజ్ నెట్‌వర్క్ ఉందనే అనుమానంతో ఎన్ఐఏ ఇవాళ సోదాలు చేపట్టింది.






