- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లాడ్జిలో తల్లి, కొడుకు ఆత్మహత్య.. కారణం ఇదేనా!?
విశాఖలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని సింహాచలంలో ఒక ప్రైవేట్ లాడ్జిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

దిశ,వెబ్‌డెస్క్: విశాఖలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని సింహాచలంలో ఒక ప్రైవేట్ లాడ్జిలో తల్లి, కుమారుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు గాజువాకకు చెందిన వారిగా గుర్తించారు. గోపాలపట్నం సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. గయప్పాంజన్ కుడుపూడి(39) హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ తరుణంలో అతను హైదరాబాద్‌కు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో 2023లో ఆయన భార్య నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
ఇదిలా ఉంటే.. గురువారం సాయంత్రం తల్లి నీలావతి(59)తో కలిసి సింహాచలం వచ్చిన గయప్పాంజన్ ఓ ప్రైవేటు లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. అనంతరం తల్లి కొడుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక, రాత్రి సమయంలో లాడ్జి యాజమాన్యం తలుపు నెట్టడంతో ఎంతకు తీయకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని తలుపులు పగలుగొట్టగా ఇద్దరూ సీలింగ్‌కు ఉరేసుకుని కనిపించారు.
అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించి.. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కుమారుడిపై భార్య పెట్టిన 498 ఏ కేసు కారణంగా మనస్తాపం చెంది వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గోపాలపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






