11 మంది భర్తలను చంపిన భార్య.. దేశాన్ని షేక్ చేస్తున్న న్యూస్..

by Sujitha Rachapalli |

ఇరాన్‌లో మహాదారుణమైన కేసు వెలుగులోకి వచ్చింది. 56ఏళ్ల మహిళ కుల్తుమ్ అక్బరీ ఏకంగా 11 మంది భర్తలను హత్య చేసింది. 2000 నుంచి 2023 వరకు ఈ హత్యలు జరగ్గా.. డబ్బులున్న వృద్ధులను పెళ్లి చేసుకుని.. వారు సహజంగా మరణించారని చిత్రీకరించడంలో సక్సెస్ అయింది.

11 మంది భర్తలను చంపిన భార్య.. దేశాన్ని షేక్ చేస్తున్న న్యూస్..
X

దిశ, వెబ్ డెస్క్ : ఇరాన్‌లో మహాదారుణమైన కేసు వెలుగులోకి వచ్చింది. 56ఏళ్ల మహిళ కుల్తుమ్ అక్బరీ ఏకంగా 11 మంది భర్తలను హత్య చేసింది. 2000 నుంచి 2023 వరకు ఈ హత్యలు జరగ్గా.. డబ్బులున్న వృద్ధులను పెళ్లి చేసుకుని.. వారు సహజంగా మరణించారని చిత్రీకరించడంలో సక్సెస్ అయింది. ఎలాంటి అనుమానం రాకుండా చేసింది. డయాబెటిస్ ట్యాబ్లెట్స్, సెడెటివ్స్, స్టిమ్యులెంట్స్, ఆల్కహాల్‌ కలిపి ఇచ్చి చంపేది. ఒక్కోసారి తడిగా ఉన్న టవల్స్‌ను మెడ చుట్టూ బిగించి ఊపిరాకుండా చేసేది. కానీ వీరంతా వృద్ధులు కావడంతో అనుమానం రాలేదు. నేచురల్ డెత్‌గానే పరిగణించేవారు. కానీ అలా చనిపోయిన వారి ఆస్తి ఆమె పేరున రావడం.. ఆ తర్వాత మరో పెళ్లి చేసుకుని ఇదే పని చేయడం కంటిన్యూ చేసింది.

అయితే 2023లో 82ఏళ్ల అజీజొల్లా మరణం ఆమెను పట్టించింది. అతని కుమారుడుకి అనుమానం వచ్చి విషయాలు కనుక్కునే ప్రయత్నం చేయగా.. ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ తండ్రి కూడా ఇదే పేరున్న లేడీ చేతిలో చనిపోయినట్లు తెలుసుకున్నాడు. చివరికి మహిళ తనే అని నిర్ధారణకు వచ్చాడు. ఆ తర్వాత న్యాయం కోసం కోర్టుకు వెళ్లాడు. మొత్తానికి అక్బరీ ఇరాన్ సారీలోని రివల్యూషనరీ కోర్టులో 11 హత్యలు చేసినట్లు ఒప్పుకుంది. లెక్క సరిగ్గా చెప్పకపోయే సరికి ఈ సంఖ్య 13 నుంచి 15 వరకు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాగా ఆమెకు ఇస్లామిక్ చట్టం ప్రకారం మరణశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో తాజాగా విచారణ జరగడంతో ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది.

Next Story