- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెంగళూరు-చెన్నై హైవే గ్యాంగ్ మకాం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
బెంగళూరు-చెన్నై హైవే సర్వీస్ రోడ్డులో మకాం వేసి ఐపీఎల్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

దిశ, చిత్తూరు ప్రతినిధి: ఐపీఎల్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని, మరో ఐదుగురు పరారీ అయ్యారని చిత్తూరు రెండవ పట్టణ సీఐ నెట్టి కంఠయ్య తెలిపారు. సోమవారం రాత్రి బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారిపై కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. సీఐ నెట్టి కంఠయ్య తెలిపిన వివరాల మేరకు... చిత్తూరు నగరం బెంగళూరు-చెన్నై హైవే సర్వీస్ రోడ్డులోని మూసివేసిన శృతి మిల్క్ డెయిరీ సమీపంలో బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందిందన్నారు. దీంతో ఎస్ఐ రమేష్ బాబు, సిబ్బంది ఆకస్మికంగా దాడి చేశారని... పోలీసులను చూసి తప్పించుకోబోయిన ఐదుగురు నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారన్నారు.
నిందితులపై బీఎన్ఎస్, ఏపీ గేమింగ్ యాక్ట్, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. అరెస్టయిన వారిలో విక్రం రెడ్డి (30), కె.వినోద్ కుమార్ @ టైలర్ వినోద్ (39), రిజ్వాన్ (34), వంశీ కృష్ణ (34), అనీష్ అహ్మద్ (30) ఉన్నారన్నారు. ఇక వినోద్, ఐశ్వర్య, మణికంఠ, వేణు, భరత్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని ఆయన తెలిపారు. బెట్టింగ్‌ల వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఐ సూచించారు. ఎక్కడైనా బెట్టింగ్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే 112 నంబర్‌కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.






