అబ్దుల్ కలామ్ మాజీ OSD పేరుతో పరిచయం.. ఉగ్యోగం అంటూ రూ.7 లక్షలకు కుచ్చుటోపీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-06 05:38:53  IST  )

ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే నిరుద్యోగి ఆశను ఆసరాగా చేసుకుని, ఓ ప్రబుద్ధుడు లక్షల రూపాయలు వసూలు చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

అబ్దుల్ కలామ్ మాజీ OSD పేరుతో పరిచయం.. ఉగ్యోగం అంటూ రూ.7 లక్షలకు కుచ్చుటోపీ
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే నిరుద్యోగి ఆశను ఆసరాగా చేసుకుని, ఓ ప్రబుద్ధుడు లక్షల రూపాయలు వసూలు చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సయ్యద్ హైదర్ హుస్సేన్ (Syed Haider Hussain) అనే వ్యక్తి తాను గతంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వద్ద OSD (Officer on Special Duty)గా పనిచేశానని, తనకు కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో ఉన్నత స్థాయి పరిచయాలు ఉన్నాయని నమ్మబలికాడు. ఈ క్రమంలో గ్రూప్-1 ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఓ బాధితుడు ఇతడి వలలో పడ్డాడు. 2022లో బాధితుడి నుంచి రూ.7 లక్షలు వరకు వసూలు చేశాడు.

అయితే, ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడం, అడిగితే సరైన సమాధానం చెప్పకపోవడంతో బాధితుడు తాను మోసపోయానని గ్రహించాడు. నిందితుడు తన డబ్బును తిరిగి ఇవ్వకుండా తిప్పించుకోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ (Banjara Hills) పోలీసులు సయ్యద్ హైదర్ హుస్సేన్‌పై కేసు నమోదు చేశారు. నిందితుడు నిజంగానే అబ్దుల్ కలాం వద్ద పనిచేశాడా లేక ఆ పేరు చెప్పుకుని గతంలో ఇంకెవరినైనా మోసం చేశాడా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.

Read More..

మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు.. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం

Next Story