- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు.. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం
వృద్ధులే లక్ష్యంగా పెరిగిపోతున్న డిజిటల్ అరెస్ట్ మోసాలు.

దిశ, వెబ్ డెస్క్ : ఓ వృద్ధుడిని డిజిటల్ అరెస్టు (Digital Arrest) పేరిట అదరగొట్టి బెదరగొట్టేశారు సైబర్ క్రిమినల్స్. అంతటితో ఆగకుండా అందినకాడికి అతని వద్ద నుంచి దోచుకున్నారు. తాను మోసపోయిన విషయం తెలుసుకున్న వృద్ధుడు లబోదిబోమన్నారు. పరుగుపరుగున వెళ్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడలోని (Vijayawada) నున్న రాజీవ్ నగర్ కు చెందిన ఓ వృద్ధుడికి (73) గతేడాది డిసెంబర్ 16న ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాము టెలికాం డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేశామంటూ కాల్ చేసిన వారు తమను తాము పరిచయం చేసుకున్నారు. సైబర్ నేరానికి వృద్ధుడి ఫోన్ నెంబర్ వాడారని తెలిపారు. సదఖత్ ఖాన్ అనే వ్యక్తితో కలిసి మనీలాండరింగ్ కు పాల్పడ్డారని ఊదరగొట్టారు. వారి మాటలకు సదరు పెద్దమనిషి (Senior Citizen) బెంబేలెత్తిపోయారు. దీంతో సైబర్ క్రిమినల్స్ తమ కుట్రకు తెరలేపారు. న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోకుండా ఉండేందుకు తాము చెప్పినట్లు చేయాలన్నారు. కేసు విచారణ అయ్యే వరకు కొంత డబ్బు తమ వద్ద జమ చేయాలని వృద్ధుడికి నమ్మబలికారు. రెండు విడుతల్లో సుమారు 10.7 లక్షల రూపాయలను వసూలు చేశారు. తరువాత తమ కాంటాక్ట్ ను బ్లాక్ చేసుకున్నారు. ఘటన నుంచి తేరుకున్న వృద్ధుడు తాను మోసపోయిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు. ఇక తనకు న్యాయం చేయాలని కోరుతూ జనవరి 2న సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వృద్ధుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Read More..
అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా తగ్గే అవకాశం.. SBI నివేదిక






