- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల అరెస్టు
హైవేలపై వెళ్లే రన్నింగ్ లారీలను టార్గెట్ చేసి కట్టర్లతో సీల్ ఓపెన్ చేసి చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

దిశ, కామారెడ్డి : హైవేలపై వెళ్లే రన్నింగ్ లారీలను టార్గెట్ చేసి కట్టర్లతో సీల్ ఓపెన్ చేసి చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. గురువారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. గత నెల 11న 44వ జాతీయ రహదారిపై కంటైనర్ లో నుంచి రూ.10 లక్షల విలువ చేసే ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఈ కేసు విచారణలో భాగంగా రెండు బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు చోరీకి పాల్పడింది మధ్యప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించి గురువారం ఐదుగురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల్లో ముగ్గురిని అరెస్ట్ చేయగా రన్నింగ్ లారీని బైకుపై చేజ్ చేసి కట్టర్లతో కంటైనర్ సీల్ ఓపెన్ చేసి అందులోకి చొరబడి ఫోన్లు, హెడ్ సెట్లు ఎత్తుకెళ్లినట్టు ఒప్పుకున్నట్టు ఎస్పీ తెలిపారు. గమనించిన డ్రైవర్ కంటైనర్ ను ఆపగా చాకుతో బెదిరించినట్టు ఎస్పీ పేర్కొన్నారు. ఐదుగురు ముఠా సభ్యులలో మధ్యప్రదేశ్ కు చెందిన రిథిక్ జాంజ, మాల్వియా దీపక్ కుమార్, దేవీసింగ్ సిసోడియాలను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ప్రదీప్ హుడా, విమల్ సిసోడియాలు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకోవడం కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అరెస్టైన వారి నుంచి ఒక బైక్, చాకు, 3 మొబైల్స్, ఒక కట్టర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి, కామారెడ్డి రూరల్ సీఐ రామన్, మాచారెడ్డి, దేవునిపల్లి ఎస్సైలు అనిల్, రంజిత్ పాల్గొన్నారు.






