- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజన్న సిరిసిల్ల టూ రాజస్థాన్.. లింక్ లోనే అసలు మాయాజాలం.. కట్ చేస్తే
వెబ్ లింకులు పంపుతూ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తులను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి.గీతే తెలిపారు.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : వెబ్ లింకులు పంపుతూ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తులను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి.గీతే తెలిపారు. గురువారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కపిల్ శర్మ, పంకజి కౌశిక్ అనే ఇద్దరు వ్యక్తులు XTcoin.com అనే వెబ్ లింకుతో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు.
జిల్లాలోని చందుర్తి మండలం దేవుని తండా గ్రామానికి చెందిన గుగులోతు రమేష్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మి XTcoin.com వెబ్ సైట్ లింకులో రూ.7,32000 పెట్టుబడి పెట్టాడు. రెండు రోజుల తర్వాత అమౌంట్ విత్ డ్రా కాలేదు. మరో రెండు రోజుల తర్వాత వెబ్ సైట్ పూర్తిగా తొలగించబడింది. దాంతో మోసపోయని గ్రహించిన రమేష్ చందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి సీఐ వెంకటేశ్వర్లు దర్యాప్తు ప్రారంభించారు.
జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఆదేశాల మేరకు చందుర్తి సి.ఐ వెంకటేశ్వర్లు, సైబర్ క్రైం టీమ్ తో సాంకేతికత ఆధారంగా రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో నిందితులను అరెస్ట్ చేసి గురువారం రిమాండ్ కి తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి సాంకేతికత ఆధారంగా నిందితులను పట్టుకున్న స్పెషల్ టీం చందుర్తి సి.ఐ వెంకటేశ్వర్లు, సైబర్ క్రైమ్ ఎస్.ఐ జునైద్, సిబ్బంది గంగారాం, మహేష్ లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.






