బెంగుళూరులో దారుణం.. కోరిక తీర్చలేదని టెకీని హత్య చేసిన ఇంటర్ విద్యార్థి

by Ajay Maddhiboyina |

బెంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. కోరిక తీర్చ‌లేద‌ని సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఇంట‌ర్ విద్యార్థి హ‌త్య చేశాడు. ఈ ఘ‌ట‌న రామ్మూర్తిన‌గ‌ర ఠాణా ప‌రిధిలోని సుబ్ర‌హ్మ‌ణ్య లేఅవుట్లో చోటు చేసుకుంది.

బెంగుళూరులో దారుణం.. కోరిక తీర్చలేదని టెకీని హత్య చేసిన ఇంటర్ విద్యార్థి
X

దిశ, వెబ్ డెస్క్: బెంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. కోరిక తీర్చ‌లేద‌ని సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఇంట‌ర్ విద్యార్థి హ‌త్య చేశాడు. ఈ ఘ‌ట‌న రామ్మూర్తిన‌గ‌ర ఠాణా ప‌రిధిలోని సుబ్ర‌హ్మ‌ణ్య లేఅవుట్లో చోటు చేసుకుంది. క‌ర్ణాట‌క‌లోని మంగ‌ళూరుకు చెందిన ష‌ర్మిల కుశాల‌ప్ప 34త‌న స్నేహితుడితో క‌లిసి సుబ్ర‌హ్మ‌ణ్య లేఅవుట్ లో నివాసం ఉంటుంది. కాగా ఈ నెల 3న ష‌ర్మిల ఫ్లాట్ లో మంట‌లు చెల‌రేగి ఆమె మ‌ర‌ణించిన‌న‌ట్టు పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు విచారించ‌డా షాకింగ్ విషాలు వెలుగులోకి వ‌చ్చాయి. మంట‌లు అంటుకోకుండానే ష‌ర్మిల మ‌ర‌ణించిందని, ఆమె శ‌రీరంపై గాయాలు ఉన్నాయ‌ని ఊపిరి ఆడ‌క‌పోవ‌డంతో ఆమె మ‌ర‌ణించింద‌ని ఫోరెన్సిక్ నివేదిక‌లో వైద్యులు వెల్ల‌డించారు.

దీంతో పోలీసుల‌కు అనుమానం వ‌చ్చి సీసీ కెమెరాల‌ను ప‌రిశీలించారు. కాగా ష‌ర్మిల ఉండే ఫ్లాట్ ప‌క్క‌న కొడ‌గు జిల్లా విరాజ పేట‌కు చెందిన ఇంట‌ర్ సెకండియ‌ర్ విద్యార్థి క‌ర్న‌ల్ కురై అత‌డి త‌ల్లితో క‌లిసి ఉంటున్నాడు. కాగా ఈ నెల 3న‌ ష‌ర్మిల స్నేహితుడు ఇంట్లో లేని స‌మ‌యంలో క‌ర్న‌ల్ కురై గది కిటికీలో నుండి ష‌ర్మిల ఫ్లాట్ లోకి దూరి లైంగిక కోరిక తీర్చాల‌ని ఒత్తిడి చేశాడు. దీంతో ష‌ర్మిల గ‌ట్టిగా అరుస్తూ కేక‌లు వేయ‌డంతో క‌త్తితో ఆమెపై దాడి చేశాడు. అనంత‌రం కింద‌ప‌డేసి దిండుతో ఊపిరాడ‌కుండా చేసి హ‌త‌మార్చాడు. అనంత‌రం గాయాల‌తో ఉన్న దుస్తుల‌ను ఆమె కిచెన్ లో కాల్చాడు. మంట‌లు వ్యాపించ‌డంతో తిరిగి కిటికీ నుండి త‌న బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి విచారిస్తున్నారు.

Next Story