హాస్టల్ భవనంపై నుంచి పడి ఇంటర్ విద్యార్థిని మృతి

by Muthe.Rajitha |

మంచిర్యాలలో తీవ్ర విషాదం నెలకొంది. మంచిర్యాల మిమ్స్ జూనియర్ కాలేజీలోని హాస్టల్ భవనంపై నుంచి ప్రమాదవశాత్తు పడి ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది.

హాస్టల్ భవనంపై నుంచి పడి ఇంటర్ విద్యార్థిని మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : మంచిర్యాలలో తీవ్ర విషాదం నెలకొంది. మంచిర్యాల మిమ్స్ జూనియర్ కాలేజీలోని హాస్టల్ భవనంపై నుంచి ప్రమాదవశాత్తు పడి ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మూడవ అంతస్తులో ఉన్న హాస్టల్ లో రాత్రి భోజనానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు తోటి విద్యార్థినులు తెలిపారు. మృతి చెందిన విద్యార్థిని బైపీసీ రెండవ సంవత్సరం చదువుతున్న సహస్రగా పోలీసులు పేర్కొన్నారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండానే కాలేజీలో హాస్టల్ నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, లేక ఎవరైనా కావాలని నెట్టి వేశారా, లేక ఆత్మహత్యకు పాల్పడిందా అనే విషయాలు విచారణలో తేలుస్తామని అన్నారు.

Next Story