ఇంట‌ర్ ఫెయిల్ అయిన విద్యార్థిని ఆత్మ‌హ‌త్య

by Ratna Kumari |

ఇంట‌ర్ ఫెయిల్ అయిన విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని చందారం గ్రామంలో చోటు చేసుకుంది.

ఇంట‌ర్ ఫెయిల్ అయిన విద్యార్థిని ఆత్మ‌హ‌త్య
X

దిశ‌, ల‌క్షెట్టిపేట : ఇంట‌ర్ ఫెయిల్ అయిన విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని చందారం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై గోప‌తి సురేష్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. చందారం గ్రామానికి చెందిన ఆర్సె మాధ‌వి(17) ఇంట‌ర్మీడియ‌ట్ లో ఫెయిల్ కావ‌డంతో మ‌న‌స్థాపం చెంది ఇంట్లో చున్నితో ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. మృతురాలి తల్లిదండ్రులు చనిపోవడంతో మాధవి వాళ్ళ అక్క, అమ్మమ్మతో కలిసి చందారంలో ఉంటోంది. తల్లిదండ్రులు లేకపోవడంతో గ్రామస్తులు బంధువులు ప్రోత్సాహంతో చదువుకుంటుంది. మృతురాలు అక్క హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుంది.

గత నెల వెలువడిన ఫలితాల్లో ఇంటర్మీడియట్ తప్పడంతో దిగులుగా ఉండేది ఇంట్లో వాళ్ళు ఓదార్చిన అప్పటి వరకు సరే అంటూ మళ్ళీ దిగులు పడేది. శుక్రవారం తన అక్క హైదరాబాద్ వెళ్తూ సరుకులు కొనిచ్చి చందారం పంపించి తను హైదరాబాద్ కి వెళ్లిపోయింది. అమ్మమ్మ ఇంటికి వెళ్లి చూసే సరికి ఇంట్లో లోపటికి గడియ వేసుకొని ఉండి ఎంత పిలిచినా పలకకపోవడంతో ఇంటి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి తలుపులు పగులుగొట్టి చూసే సరికి ఉరి వేసుకొని చనిపోయి ఉంది. మృతురాలి అక్క అరిసె మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Next Story