- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్‌వోటీ పోలీసుల ముమ్మర తనిఖీలు.. రూ.6 కోట్ల విలువైన గంజాయి సీజ్
రాష్ట్రంలో (Telangana)లో గంజాయి, డ్రగ్స్ (Drugs), ఇతర మత్తు పదార్థాల వినియోగం పట్ల సర్కార్ ఉక్కపాదం మోపుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో (Telangana)లో గంజాయి, డ్రగ్స్ (Drugs), ఇతర మత్తు పదార్థాల వినియోగం పట్ల సర్కార్ ఉక్కపాదం మోపుతోంది. డ్రగ్స్ విక్రయిస్తూ.. ఎవరైనా పట్టుబడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ పోలీసు శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈగల్ టీమ్, టాస్క్‌ఫోర్స్ (Taskforce), ఎస్‌ఓటీ (SOT), నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు (Railway Stations), ఎయిర్‌పోర్టు (Airports)లు, పట్టణాల్లోని జాతీయ రహదారులపై వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతూ ఎక్కడికక్కడ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు మహేశ్వరం, రాచకొండ ఎస్‌ఓటీ (SOT) పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ వద్ద తనిఖీలు చేస్తుండగా.. డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న సమారు 1,100 కిలోల రూ.6 కోట్ల విలువ చేసే గంజాయిని గుర్తించి సీజ్ చేశారు. అనంతరం ముఠాను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.






