TG: ప్రయివేట్ నర్సింగ్ కాలేజీల్లో తనిఖీలు.. విస్తుపోయిన అధికారులు

by Gantepaka Srikanth |

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(Director of Medical Education) ఆధ్వర్యంలో తెలంగాణలోని 21 ప్రైవేట్ నర్సింగ్ కాలేజీల(Nursing Colleges)పై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

TG: ప్రయివేట్ నర్సింగ్ కాలేజీల్లో తనిఖీలు.. విస్తుపోయిన అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(Director of Medical Education) ఆధ్వర్యంలో తెలంగాణలోని 21 ప్రైవేట్ నర్సింగ్ కాలేజీల(Nursing Colleges)పై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలో ఈ స్థాయిలో తనిఖీలు నిర్వహించడం ఇదే మొదటిసారి అని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాలేజీల పరిస్థితి చూసి అధికారులు విస్తు పోయారు. నల్లగొండలో ఒకే భవనంలో నాలుగు నర్సింగ్ స్కూల్స్, రంగారెడ్డి జిల్లాలో ఒకే భవనంలో 8 నర్సింగ్ స్కూల్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హయత్ నగర్‌లో ఒకే భవనంలో 8 నర్సింగ్ స్కూల్స్ ఉండటంతో పాటు పర్మిషన్ తీసుకున్న ప్రాంతాల్లోనూ ఆయా కాలేజీలు లేనట్లు నిర్ధారించారు. క్లినికల్ ప్రాక్టీస్ లేకుండానే నర్సింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారని గుర్తించారు. ప్రజల ప్రాణాలతో ప్రైవేట్ నర్సింగ్ యాజమాన్యాలు చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నర్సింగ్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కాగా, నర్సింగ్ కాలేజీల అక్రమాలపై క్రైస్తవ జన సమితి అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Next Story