వాహదారులకు BIG అలర్ట్.. హెల్మెట్ లేకుండా వెళ్తే ‘నో పెట్రోల్’

by Gantepaka Srikanth |

రోడ్డు ప్రమాదాల నివారణ(Prevent road accidents)కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం(UP Govt) వినూత్న పాలసీ తీసుకొచ్చింది. ‘నో హెల్మెట్ - నో ఫ్యూయల్’(No helmet - no fuel) విధానానికి శ్రీకారం చుట్టింది.

వాహదారులకు BIG అలర్ట్.. హెల్మెట్ లేకుండా వెళ్తే ‘నో పెట్రోల్’
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదాల నివారణ(Prevent road accidents)కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం(UP Govt) వినూత్న పాలసీ తీసుకొచ్చింది. ‘నో హెల్మెట్ - నో ఫ్యూయల్’(No helmet - no fuel) విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల మేజిస్ట్రేట్‌లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హెల్మెట్ లేకుండా బంక్‌కు వచ్చే వారికి పెట్రోల్ పోయొద్దని బంకులకూ నోటీసులు జారీ చేసింది. బైక్ ప్రమాదాల్లో అధికశాతం హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రాణాలు పోతున్నాయని అధికారులు అన్నారు.

ప్రభుత్వ నూతన నిర్ణయం ప్రజల భద్రత, ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. కాగా, రోడ్డు ప్రమాదాల వల్ల యూపీలో ప్రతి ఏడాది 25,000-26,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని సీఎం యోగికి అధికారులు ఇటీవల సమాచారం అందించారు. సీఎంకు అందించిన నివేదికలో ద్విచక్ర వాహనదారుల ప్రమాదాలపై ప్రముఖంగా పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మరణాలు హెల్మెట్‌లను ఉపయోగించకపోవడం వల్లే సంభవిస్తున్నాయని తేలింది. దీంతో ఈ పాలసీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Next Story