ప్రియురాలితో పెళ్లి కోసం.. అమాయకుడి హత్య

by Sujitha Rachapalli |

ఓ అమ్మాయిని ప్రేమించాడు.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.. కానీ ఆమె తండ్రి, అన్న అడ్డు వచ్చారు. దీంతో దారుణమైన ప్లాన్ వేశాడు ప్రియుడు మనోజ్. ఎవరినైనా చంపేసి.. ఆ హత్యను ప్రియురాలి తండ్రి, సోదరుడి మీదకు నెడితే జైలుకు వెళ్తారని.. హాయిగా

ప్రియురాలితో పెళ్లి కోసం.. అమాయకుడి హత్య
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ అమ్మాయిని ప్రేమించాడు.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.. కానీ ఆమె తండ్రి, అన్న అడ్డు వచ్చారు. దీంతో దారుణమైన ప్లాన్ వేశాడు ప్రియుడు మనోజ్. ఎవరినైనా చంపేసి.. ఆ హత్యను ప్రియురాలి తండ్రి, సోదరుడి మీదకు నెడితే జైలుకు వెళ్తారని.. హాయిగా ఆమెను పెళ్లి చేసుకోవచ్చని అనుకున్నాడు. సోదరుడు మన్‌జీత్‌తో కలిసి యోగేష్ అనే అమాయకుడిని హత్య చేశాడు. ఆ తర్వాత చనిపోయిన వ్యక్తి సెల్ ఫోన్ నుంచి పోలీసులకు ఫోన్ చేసి.. గర్ల్ ఫ్రెండ్ బ్రదర్, ఫాదర్ కొడుతున్నారని వారి పేర్లు చెప్పాడు. వారిని నిందితులుగా మార్చాలనుకున్నాడు. కానీ విచారణలో అది యోగేష్ వాయిస్ కాదని.. మనోజ్‌దేనని, హత్య చేసి డ్రామాలు ఆడారని తేలింది. దీంతో ప్రియుడు, అతడిని సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. యూపీ మొరదాబాద్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.

Next Story