- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టపగలే నగరంలో అమానుషం.. ఇంట్లోకి చొరబడి మహిళ దారుణ హత్య
విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుందన్న కక్షతో వనస్థలిపురంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సునీతను ఆమె మాజీ భర్త మహేష్ అతి కిరాతకంగా హత్య చేశాడు.

దిశ, వెబ్‌డెస్క్: నగరం నడిబొడ్డున వనస్థలిపురం (Vanasthalipuram)లో ఇవాళ మధ్యాహ్నం పెను సంచలనం చోటుచేసుకుంది. గ్రీన్ సిటీ కాలనీ (Green City Colony)లో నివసిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సునీత (30)ను ఆమె మాజీ భర్త మహేష్ (Mahesh) అతి కిరాతకంగా హతమార్చాడు చేశాడు. విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుందన్న కక్షతోనే మహేష్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. మహేష్ విదేశాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సునీత, మహేష్‌ల మధ్య 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కొన్నాళ్ల క్రితం సునీత అతనికి చట్టబద్ధంగా విడాకులు ఇచ్చేసి మరో వ్యక్తిని వివాహం చేసుకుని గ్రీన్ సిటీ కాలనీలో నివసిస్తోంది.
పెట్రోల్ డబ్బాతో బీభత్సం..
ఈ క్రమంలోనే సునీత (Sunitha) రెండో పెళ్లిని జీర్ణించుకోలేకపోయిన మహేష్, ఆమెపై విపరీతంగా పగ పెంచుకున్నాడు. ఎలాగైన అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇవాళ మధ్యాహ్నం రెండు పదునైన కత్తులు, పెట్రోల్ డబ్బాతో సునీత నివాసంలోకి చొరబడ్డాడు. అడ్డువచ్చిన వారిని పెట్రోల్ పోసి తగలబెడతానని బెదిరిస్తూ బీభత్సం సృష్టించాడు. అనంతరం ఇంట్లోకి ప్రవేశించిన మహేష్, సునీతపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయగా ఆమె కుప్పకూలిన తర్వాత కూడా వదలకుండా, అక్కడే ఉన్న పూలకుండీతో తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో సునీత విలవిలాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
పోలీసుల అదుపులో నిందితుడు..
స్థానికుల సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన వనస్థలిపురం పోలీసులు (Police) ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పట్టపగలే కాలనీలో హత్య జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు.






