- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరంలో అమానవీయ ఘటన.. మూడో అంతస్తు నుంచి బిడ్డను విసిరేసిన తల్లి
కంటికిరెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే కన్నబిడ్డను కాటికి పంపిన అమానవీయ ఘటన నగరం నడిబొడ్డున చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: కంటికిరెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే కన్నబిడ్డను కాటికి పంపిన అమానవీయ ఘటన నగరం నడిబొడ్డున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మల్కాజ్‌గిరి పరిధిలోని వసంతపురి కాలనీలో మోనాలిసా దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే, కొన్నాళ్లుగా మోనాలిసా మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం తన ఏడేళ్ల కూతురు షారోనీ మేరిని ఏకంగా మూడంతస్తుల బిల్డింగ్ పైనుంచి విసిరేసింది. ఈ దుర్ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిశీలించిన వైద్యులు చిన్నారి అప్పటికే మృతి చెందినట్లుగా ధృవీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
Next Story






