- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేరళలో దీపక్ ఆత్మహత్యకు కారణమైన ఇన్‌ఫ్లుయెన్సర్ అరెస్ట్
కేరళలో దీపక్ అనే ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీపక్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అంటూ షింజితా ముస్తఫా అనే సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ బస్సులో ప్రయాణిస్తూ వీడియో తీయగా అది వైరల్ అయింది.

దిశ, వెబ్ డెస్క్: కేరళలో దీపక్ అనే ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీపక్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అంటూ షింజితా ముస్తఫా అనే సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ బస్సులో ప్రయాణిస్తూ వీడియో తీయగా అది వైరల్ అయింది. వీడియో వైరల్ అవ్వడంతో తానేం తప్పు చేయలేదని తీవ్రమనస్థాపానికి గురై దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే విచారణలో దీపక్ తప్పేమీ లేదని, అతడు మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించలేదని తేలింది. వీడియోలో కూడా ఎక్కడా షింజితాతో దీపక్ అసభ్యకరంగా ప్రవర్తించినట్టు కనిపించలేదు.
ఈ ఘటనను కేరళ హ్యూమన్ రైట్స్ కమిషన్ సీరియస్ గా తీసుకుని నార్త్ జోన్ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లోగా నిందితురాలిని పట్టుకుని విచారించి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇక మొదట నిందితురాలి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు సైతం జారీ చేశారు. కానీ నేడు కేరళలోనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన సమయంలో షింజితా మనసులో ఎలాంటి పశ్చాతాపం కనిపించలేదు. అరెస్ట్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఆమెను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.






