- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. నవజాత శిశువును కొరికి చంపిన ఎలుకలు
ఇండియాలోనే క్లీనెస్ట్ సిటీగా గుర్తింపు పొందిన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో దారుణం చోటు చేసుకుంది. మహారాజా యశ్వంత్ రావు ప్రభుత్వాసుపత్రిలో నవజాత శిశువును ఎలుకలు కొరికి చంపిన ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది.

దిశ, వెబ్ డెస్క్ : ఇండియాలోనే క్లీనెస్ట్ సిటీగా గుర్తింపు పొందిన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో దారుణం చోటు చేసుకుంది. మహారాజా యశ్వంత్ రావు ప్రభుత్వాసుపత్రిలో నవజాత శిశువును ఎలుకలు కొరికి చంపిన ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపింది. అయితే ముందుగా బిడ్డ పుట్టిన అనారోగ్య పరిస్థితి ఇందుకు కారణమని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.
కానీ తర్వాత పేషెంట్ల కుటుంబ సభ్యుల వార్డుల్లోకి ఫుడ్ తీసుకురావడం వల్ల ఇదంతా జరిగిందని.. అందుకే ఎలుకలు వస్తున్నాయని తెలిపారు హాస్పిటల్ సూపరిండెంట్. ఈ కారణంగా ఇద్దరు నర్సింగ్ ఆఫీసర్స్‌ను సస్పెండ్ చేశామని, లక్ష రూపాయల జరిమానా విధించామని చెప్పారు. అయితే ఈ ఇష్యూ పొలిటికల్‌గా కూడా సంచలనం సృష్టించింది. బాధితులకు అండగా ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. సెప్టెంబర్ 4న ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.






