కెనడాలో భారత సంతతి వ్యక్తి హత్య

by Naga Rani Yarlagadda |

భారత సంతతికి చెందిన దిల్ రాజ్ సింగ్ గిల్ అనే వ్యక్తి కెనడాలో హత్యకు గురయ్యాడు. బ్రిటీష్ కొలంబియాలోని బర్నబే వద్ద ఈ ఘటన జరిగింది.

కెనడాలో భారత సంతతి వ్యక్తి హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: భారత సంతతికి చెందిన దిల్ రాజ్ సింగ్ గిల్ అనే వ్యక్తి కెనడాలో హత్యకు గురయ్యాడు. బ్రిటీష్ కొలంబియాలోని బర్నబే వద్ద ఈ ఘటన జరిగింది. వాంకోవర్ లో ఉంటున్న దిల్ రాజ్ హత్యకు గురికావడం వెనుక గ్యాంగ్ వార్ ప్రధాన కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. జనవరి 22న 3700 కెనడా వేలో జరిగిన కాల్పుల్లో అతను మరణించినట్లు తెలిపారు. కాల్పులపై తమకు సమాచారం అందగా.. అక్కడికి వెళ్లే సరికే ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నాడని, కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేదని పేర్కొన్నారు. ఆ తర్వాత బక్స్ టోన్ స్ట్రీట్ లో వాహనం తగలబడటాన్ని అధికారులు గుర్తించారు. ఈ రెండు ఘటనలకు మధ్య సంబంధం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. గిల్ తమకు సుపరిచితుడేనని పోలీసులు చెప్పడం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story