- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో దారుణం.. టవర్స్ పైనుంచి దూకి ఇన్‌కం ట్యాక్స్ అధికారిణి సూసైడ్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad)లో దారుణ ఘటన చోటుచేసుకున్నది.

X
దిశ, వెబ్‌డెస్క్/రాంనగర్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad)లో దారుణ ఘటన చోటుచేసుకున్నది. గాంధీ నగర్ పోలీస్ స్టేషన్(Gandhi Nagar Police Station) పరిధిలో ఇన్‌కం ట్యాక్స్ అధికారిణి(Income Tax Officer) జయలక్ష్మి(Jayalakshmi) బలవన్మరణానికి పాల్పడింది. శనివారం మధ్యాహ్నం సీజీవో టవర్స్(CGO Towers) పైనుంచి దూకేసింది. దీంతో తీవ్ర గాయాలతో పడివున్న ఆమెను స్థానికులు గుర్తించి హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే స్పాట్‌కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనారోగ్య కారణాల వల్లనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






