- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంచిర్యాల పట్టణంలో పట్టపగలే దొంగల బీభత్సం
by Kema Shiva Kumar |
పట్టణ కేంద్రం లోని ఆదిత్యా ఎంక్లేవ్స్ పరిధిలోని కృతిక అపార్ట్ మెంట్ లో మంగళవారం దాదాపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో రెండు ఫ్లాట్లలో దొంగలు చొరబడటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.

X
దిశ, మంచిర్యాల టౌన్ : పట్టణ కేంద్రం లోని ఆదిత్యా ఎంక్లేవ్స్ పరిధిలోని కృతిక అపార్ట్ మెంట్ లో మంగళవారం దాదాపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో రెండు ఫ్లాట్లలో దొంగలు చొరబడటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. కృతిక అపార్ట్ మెంట్ లోని 105, 209 ఫ్లాట్లలో దొంగలు పడ్డారు. ఫ్లాట్ యజమానులు గత నాలుగు రోజుల నుంచి లేకపోవడంతో అదనుగా భావించిన దుండగులు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.1 05లో ఉండే బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ ఫ్లాట్ లో చిన్నపాటి వస్తువులను ఎత్తుకెళ్లారు. అదేవిధంగా 209లో ఉండే సాయి విద్యుత్ శాఖలో విధుల నిర్వర్తిస్తున్నాడు. అతని ఫ్లాట్ లో రెండు తులలు బంగారం పోయిందని బాధితుడు తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తును ప్రారంభించారు.
Next Story






