మట్టిగోడ కూలి అన్నదమ్ముల దుర్మరణం..

by Batti.Sumithra |   (  Updated:2023-02-21 13:05:01  IST  )

నిజమాబాద్ జిల్లా మోర్తాడ్ లో విషాదం నెలకొంది.

మట్టిగోడ కూలి అన్నదమ్ముల దుర్మరణం..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజమాబాద్ జిల్లా మోర్తాడ్ లో విషాదం నెలకొంది. పాత ఇంటికి మరమ్మతులు చేస్తుండగా గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములిద్దరూ మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన మంగళవారం మోర్తాడ్ మండల కేంద్రంలో జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అన్నదమ్ములైన గోను బెల్ధారి రాములు (70), బెల్ధారి లింగన్న(68)లు తమ పాత మట్టి ఇంటికి మరమ్మత్తులు చేస్తుండగా ఓకేసారి గోడ కూలిపోయింది. దీంతో తమ్ముడు లింగన్న సంఘటనా స్థలంలో చనిపోగా, అన్న రాములు వైద్యంకోసం తరలిస్తుండగా మృతి చెందాడని తెలిపారు. ఈ సంఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Next Story