- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కట్నం కోసం కోడలిపై అత్తమామలు దారుణం.. హెచ్ఐవీ ఇంజెక్షన్‌తో ఏం చేశారంటే?
తరాలు మారుతున్న కట్నం కోసం అత్తింటి కుటుంబ సభ్యుల వేధింపులు మాత్రం ఆగటం లేదు.

దిశ, వెబ్ డెస్క్: తరాలు మారుతున్న కట్నం కోసం అత్తింటి కుటుంబ సభ్యుల వేధింపులు మాత్రం ఆగటం లేదు. అదనపు కట్నం ఇవ్వలేదని తమ కోడలిపై ఓ కుటుంబం దారుణానికి ఒడిగట్టారు. హెచ్ఐవీ బాధితుడికి ఉపయోగించిన ఇంజెక్షన్‌ను (HIV infected needle)ను తమ కోడలికి బలవంతంగా ఇంజెక్షన్ చేసింది. దీంతో ఆమె హెచ్ఐవీ బారిన పడింది. యూపీలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
యూపీలోని సహరన్‌పూర్‌కు చెందిన యువతికి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చెందిన అభిషేక్ అలియాస్ సచిన్ అనే యువకుడితో 2023 ఫిబ్రవరి 15న వివాహమైంది. దాదాపు రూ.45 లక్షలు ఖర్చు చేసి ఘనంగా పెళ్లి చేశారు. రూ.15 లక్షల కట్నంతో పాటు కారును బహుమతిగా ఇచ్చారు. అయితే పెళ్లి అయిన మరుసటి రోజు నుంచే మరో పది లక్షలు అదనపు కట్నం కావాలని కొత్త కోడలిపై అత్తింటి వారు వేధింపులకు పాల్పడ్డారు. తాము అంత మొత్తం ఇచ్చుకోలేమని యువతి తల్లిదండ్రులు చెప్పడంతో ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. అనంతరం గ్రామంలోని పెద్దల మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించి, యువతిని తిరిగి అత్తింటికి పంపారు.
అయితే, అప్పటి నుంచి మరింత ఎక్కువగా మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేశారు. అంతేకాదు, తమ కుమారుడికి మరో వివాహం చేయాలనే ఆలోచనతో కోడలిను హత్య చేసేందుకు కుట్ర పన్నారు అత్తమామలు. ఇందులో భాగంగానే 2024 మే నెలలో హెచ్‌ఐవీ వైరస్‌తో (HIV virus) కలుషితమైన ఇంజెక్షన్లు ఆమెకు బతవంతగా ఎక్కించారు. కొంతకాలం తర్వాత యువతి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా హెచ్‌ఐవీ సోకినట్లు వైద్యులు నిర్దారించారు. అయితే, భర్త అభిషేక్‌కు పరీక్షలు చేయగా.. అతడికి హెచ్‌ఐవీ నెగిటివ్‌గా తేలింది. దీంతో బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించగా, సరైన స్పందన రాకపోవటంతో కోర్టుకెళ్లాడు. తన కూతురికి అత్తింటి వారే బలవంతంగా హెచ్ఐవీ ఇంజెక్షన్ ఇచ్చారని కోర్టుకు తెలిపారు. కోర్టు ఆదేశాలతో బాధితురాలి భర్త, అత్త, ఆడపడుచు, ఆమె భర్తలపై కేసు నమోదు చేశామని, దర్యాఫ్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.






