- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణాలు తీసిన అక్రమ సంబంధం
అక్రమ సంబంధం ప్రాణాలు తీసింది. కట్టుకున్న భర్తనే భార్య పారతో తల పగులగొట్టింది. ఈ ఘటన గోపాల్ పేట మండల పరిధిలోని ఏదుట్ల గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ, గోపాల్ పేట : అక్రమ సంబంధం ప్రాణాలు తీసింది. కట్టుకున్న భర్తనే భార్య పారతో తల పగులగొట్టింది. ఈ ఘటన గోపాల్ పేట మండల పరిధిలోని ఏదుట్ల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏదుట్ల గ్రామానికి చెందిన మేకల చిన్న మల్లయ్య(40), శివమ్మ (35) దంపతులు. అయితే వీరిద్దరూ శుక్రవారం గొడవ పడ్డారు. తన భార్య వేరొకరితో అక్రమ సంబంధం కలిగి ఉందనే అనుమానంతో తరచూ ఇరువురు గొడవ పడేవారు. దీంట్లో భాగంగా శుక్రవారం రాత్రి చిన్న మల్లయ్య తన భార్యకు ఇంటిదగ్గర గొడవ జరిగింది. తన భర్త తనను ఊరికే అనుమానిస్తున్నాడని ఆవేశంతో భార్య అక్కడే ఉన్న పారతో చిన్న మల్లయ్య తలపై కొట్టింది. దీంతో చిన్న మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్న మల్లయ్య అన్న వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించామని ఎస్సై జగన్మోహన్ తెలిపారు. సంఘటన స్థలాన్ని వనపర్తి సీఐ కృష్ణ, వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, గోపాల్ పేట పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.






