అక్ర‌మ సంబంధం, హ‌త్య‌.. నిందితుడికి జీవిత ఖైదు

by Ratna Kumari |

అక్రమ సంబంధం హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధించిన సంఘ‌ట‌న భూపాల‌ప‌ల్లి జిల్లాలో చోటు చేసుకుంది.

అక్ర‌మ సంబంధం, హ‌త్య‌.. నిందితుడికి జీవిత ఖైదు
X

దిశ‌, భూపాల‌ప‌ల్లి ప్ర‌తినిధి : అక్రమ సంబంధం హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధించిన సంఘ‌ట‌న భూపాల‌ప‌ల్లి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ర‌మేష్ బాబు తుది తీర్పును వెల్ల‌డించారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. భూపాల‌ప‌ల్లి జిల్లా కాటారం మండ‌లం విల‌సాగ‌ర్ గ్రామానికి చెందిన నిందితుడు రాదండి ర‌వి, అదే గ్రామానికి చెందిన పూజ‌తో గ‌త కొంత కాలంగా అక్ర‌మ సంబంధం కొన‌సాగించాడు. ఈ క్ర‌మంలోనే పూజ వ‌ద్ద ర‌వి రూ.5ల‌క్ష‌ల విలువ క‌లిగిన బంగారు ఆభ‌ర‌ణాలు తీసుకున్నాడు. అనంత‌రం ఆమె వివాహం చేసుకోవాల‌ని, ఆ బంగారు ఆభ‌ర‌ణాలు ఇవ్వాల‌ని ఒత్తిడి చేయ‌డంతో ఆమెను ఎలాగైనా హ‌త మార్చాల‌ని ర‌వి ప‌థ‌కం ప‌న్నాడు. అందులో భాగంగా మార్చి 12, 2019న పూజా ఇంట్లోకి అక్ర‌మంగా ప్ర‌వేశించి ఆమె పై కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు. దీంతో తీవ్రంగా గాయ‌ప‌డిన పూజ‌ను హాస్పిట‌ల్ కి త‌ర‌లించ‌గా.. చికిత్స పొందుతూ మార్చి 13, 2019న మృతి చెందింది పూజ‌. ఈ హ‌త్య కేసును పోలీసులు శాస్త్రీయంగా ద‌ర్యాప్తు చేసి ప‌క్కా ఆధారాల‌తో చార్జి షీట్ దాఖ‌లు చేశారు. ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ ఎదులాపురం శ్రీనివాస్ స‌మ‌ర్థ‌వంతంగా వాద‌న‌లు వినిపించ‌డంతో నిందితుడికి శిక్ష ఖ‌రారు అయింది. జీవిత ఖైదుతో పాటు రూ.1,500 జ‌రిమానా విధించింది కోర్టు. ఈ కేసు ద‌ర్యాప్తులో సీఐలు హ‌థిరామ్, కే.శివ ప్ర‌సాద్, ఎస్సై న‌రేష్, లైజైనింగ్ ఆఫీస‌ర్ వెంక‌న్న‌, సీడీవో ర‌మేష్ లు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించినిందుకు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ వారిని అభినందించారు.

Next Story