- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాబాయ్‌తో వివాహేతర సంబంధం.. కిరాతకంగా భర్త హత్య..
లక్నోకు చెందిన రాంపేర్‌కు మీరాతో వివాహం జరిగింది. ఆయనకు తండ్రి సమానుడైన మేనమామ బసంత్ లాల్ కూడా వారితోనే జీవించేవాడు. బ్యాండ్ మేళాలో పని చేసే రాంపేర్‌కు 30వేల రూపాయలతో బ్యాండ్ సెట్ కూడా కొనిచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన రాంపేర్‌కు మీరాతో వివాహం జరిగింది. ఆయనకు తండ్రి సమానుడైన మేనమామ బసంత్ లాల్ కూడా వారితోనే జీవించేవాడు. బ్యాండ్ మేళాలో పని చేసే రాంపేర్‌కు 30వేల రూపాయలతో బ్యాండ్ సెట్ కూడా కొనిచ్చాడు. అయితే అతను పని మీద ఊర్లు తిరుగుతూ ఉండటంతో.. మీరా, బసంత్ లాల్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో రాంపేర్‌ను చంపేందుకు ప్లాన్ వేశారు. ఇందుకు బసంత్ లాల్ తన ఫ్రెండ్ కేతార్ హెల్ప్ తీసుకున్నాడు.
విలేజ్‌లో భజన్ కీర్తన్ జరుగుతున్న టైంలో రాంపేర్‌ను ఇద్దరు బయటకు పిలిచారు. మందు తాగించారు. మద్యం మత్తులో ఉన్న అతని గొంతును బట్టలతో గట్టిగా చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. తర్వాత ప్రమాదవశాత్తు చనిపోయాడని చిత్రీకరించేందుకు శవాన్ని నాలాలో పడేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. అసలు విషయం బయటపడింది. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలం నుంచి సాక్ష్యాలను సేకరించింది.






