నందిన్నె చెక్‌పోస్ట్ వద్ద నల్లబెల్లం పట్టివేత.. నిందితులు అరెస్ట్

by Bhanu |   (  Updated:2025-07-11 04:30:40  IST  )

జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలంలోని నందిన్నె చెక్‌పోస్ట్ వద్ద గురువారం అర్ధరాత్రి అధికారులు నిర్వహించిన

నందిన్నె చెక్‌పోస్ట్ వద్ద నల్లబెల్లం పట్టివేత.. నిందితులు అరెస్ట్
X

దిశ, గట్టు: జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలంలోని నందిన్నె చెక్‌పోస్ట్ వద్ద గురువారం అర్ధరాత్రి అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లాన్ని పట్టుబట్టారు. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లానుండి నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌కు అక్రమంగా తీసుకువస్తున్న అశోక్ లేలాండ్ దోస్త్ వాహనాన్ని నందిన్నె చెక్‌పోస్ట్ వద్ద గద్వాల్ ఎస్‌హెచ్‌ఓ టీం , చెక్‌పోస్ట్ సిబ్బంది అడ్డగించారు.


వాహనాన్ని పరిశీలించగా 60 బస్తాల నల్లబెల్లం (ప్రతి బస్తా 30 కిలోలు.. మొత్తం 1800 కిలోలు) ఉండటం గుర్తించారు. అక్రమ రవాణా నేపథ్యంలో వాహనాన్ని సీజ్ చేసిన అధికారులు, ముక్కిడిగుండం గ్రామానికి చెందిన బాగత్ సింగ్ , వాహన డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. ఈ వివరాలను గద్వాల్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.


Next Story