అక్రమంగా లగ్జరీ కార్ల దిగుమతి కేసు.. నటుడు దుల్కర్ సల్మాన్ ఇంట్లో ఈడీ సోదాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-08 03:53:39  IST  )

మాలీవుడ్ ప్రముఖ నటులు దుల్కర్ సల్మాన్ (Dulquer Salman), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), అమిత్‌ చకల్‌కల్‌ (Amit Chakalkal) ఇళ్లపై ఈడీ అధికారులు అధికారులు ఇవాళ ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు.

అక్రమంగా లగ్జరీ కార్ల దిగుమతి కేసు.. నటుడు దుల్కర్ సల్మాన్ ఇంట్లో ఈడీ సోదాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మాలీవుడ్ ప్రముఖ నటులు దుల్కర్ సల్మాన్ (Dulquer Salman), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), అమిత్‌ చకల్‌కల్‌ (Amit Chakalkal) ఇళ్లపై ఈడీ అధికారులు ఇవాళ ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. కేరళతో పాటు తమిళనాడులో ఏక కాలంలో మొత్తం 17 ప్రాంతాల్లో ఈ సోదాలు తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్నాయి. అయితే, భూటాన్ (Bhutan) నుంచి లగ్జరీ కార్లు అక్రమంగా దిగుమతి చేసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో భారీగా ఎత్తున మనీ లాండరింగ్ జరగిందనే ఆరోపణలు ఉన్నాయి. భూటాన్ నుంచి దాదాపు 100 అత్యంత లగ్జరీ కార్లను కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి దేశంలోకి తీసుకొచ్చినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో తాజాగా కస్టమ్స్ అధికారులు చేపడుతోన్న తనిఖీలకు అత్యంత ప్రధాన్యత నెలకొంది.

Next Story