- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ కఫ్ సిరప్ దందా.. 3 రాష్ట్రాల్లో 25 చోట్ల ఈడీ అధికారుల సోదాలు
అక్రమ కోడిన్ (Codeine) ఆధారిత కఫ్ సిరప్ దందాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఫుల్ ఫోకస్ పెట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: అక్రమ కోడిన్ (Codeine) ఆధారిత కఫ్ సిరప్ దందాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఇవాళ ఉదయం మూడు రాష్ట్రాల్లో కఫ్ సిరప్ నిల్వలు, డైవర్షన్, అమ్మకాలకు సంబంధించి మొత్తం 25 చోట్ల సోదాలు చేపడుతోంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన 30 ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద నమోదైన కేసును నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేసింది. కేసులో భాగంగా ప్రధాన నిందితుడు శుభం జైస్వాల్, అతని చార్టర్డ్ అకౌంటెంట్ విష్ణు అగర్వాల్, డిస్మిస్ చేయబడిన యూపీ పోలీస్ కానిస్టేబుల్ అలోక్ సింగ్, అమిత్ సింగ్, విశాల్ సింగ్ ఇళ్లు, కార్యాలయాల్లో రైడ్స్ కొనసాగుతున్నాయి.
మరోవైపు లక్నో (Lucknow)లోని ఒక కంపెనీ కార్యాలయం నుంచి ఈడీ 46,891 కఫ్ సిరప్ బాటిళ్లను స్వాధీనం చేసుకుంది. నిందితులు వివిధ సంస్థల ద్వారా పెద్ద మొత్తంలో CBCSను సేకరించి మోసపూరిత లైసెన్స్‌లు పొందారని గుర్తించారు. రికార్డులను కూడా నకిలీగా తయారు చేశారని, వైద్యేతర, నార్కోటిక్ ప్రయోజనాల కోసం స్టాక్‌ను డైవర్ట్ చేసి రాష్ట్ర సరిహద్దులు దాటి నేపాల్, బంగ్లాదేశ్‌లకు కూడా సరఫరా చేశారని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఉత్తరప్రదేశ్ పోలీసుల స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (STF) ఈ దందాను బట్టబయలు చేశాక బిహార్ మీదుగా భారత్ నుంచి పారిపోయిన మాస్టర్‌మైండ్‌లను గుర్తించేందుకు ఈడీ అధికారులు నేపాల్ వెళ్లనున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు ఇప్పటికే 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. కానీ, ప్రధాన నిందితుడు శుభం జైస్వాల్ దుబాయ్‌కు పారిపోయినట్లుగా తెలుస్తోంది.






