తల్లి ఇల్లీగల్ ఎఫైర్.. వ్యతిరేకించినందుకు 22 ఏళ్ల కొడుకు హత్య.. 40 లక్షల ఇన్సూరెన్స్ డబ్బుతో జల్సా..

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-31 13:39:50  IST  )

ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన ప్రదీప్ శర్మ అనే 22 ఏళ్ల కుర్రాడు.. ఏపీలో వర్క్ చేస్తున్నాడు. దీపావళికి తన సొంత గ్రామానికి వెళ్లాడు. తండ్రి చనిపోవడంతో తల్లి మమతా దేవి ఒంటరిగా ఉంటుంది. దీంతో పండుగను తనతో సెలబ్రేట్

తల్లి ఇల్లీగల్ ఎఫైర్.. వ్యతిరేకించినందుకు 22 ఏళ్ల కొడుకు హత్య.. 40 లక్షల ఇన్సూరెన్స్ డబ్బుతో జల్సా..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన ప్రదీప్ శర్మ అనే 22 ఏళ్ల కుర్రాడు.. ఏపీలో వర్క్ చేస్తున్నాడు. దీపావళికి తన సొంత గ్రామానికి వెళ్లాడు. తండ్రి చనిపోవడంతో తల్లి మమతా దేవి ఒంటరిగా ఉంటుంది. దీంతో పండుగను తనతో సెలబ్రేట్ చేసుకునేందుకు వెళ్లాడు. కానీ తల్లి ఓ గ్యాంగ్ స్టర్ అయిన రిషి కటియార్ సోదరుడు మయాంక్ కటియార్‌‌‌‌తో ఇల్లీగల్ రిలేషన్‌షిప్ పెట్టుకుందని తెలిసింది. దీంతో తనను వ్యతిరేకించాడు. ఇలాంటి పనులు చేయొద్దని సూచించాడు. కానీ తల్లి ఇదంతా పట్టించుకోకుండా.. కన్న కొడుకు మర్డర్ ప్లాన్ చేసింది. అతని పేరు మీదున్న 40 లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకుని బాయ్ ఫ్రెండ్‌తో జల్సా చేయాలనుకుంది.

ప్లాన్ ప్రకారం.. కొడుకును తన బాయ్ ఫ్రెండ్, అతని సోదరుడితో దాబాకు వెళ్లాలని ఒప్పించింది. అక్కడికి వెళ్లాక ప్రదీప్‌పై గొడ్డలితో ఎటాక్ చేసిన ఇద్దరు.. దారుణంగా చంపేసి.. యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే ప్రదీప్ కనిపించకపోవడంతో కజిన్స్ శివం, సౌరభ్ మిస్సింగ్ కేసు నమోదు చేయగా.. అసలు విషయం బయటపడింది. తల్లితో సహా ఇద్దరు సోదరులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Next Story