- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జొమాటోలో ఆర్డర్ క్యాన్సల్ చేస్తే డబ్బులు వాపస్.. సైబర్ నేరగాడి వల
జొమాటో యాప్ లో ఫుడ్ ఆర్డర్ చేసి క్యాన్సల్ చేసిన వ్యక్తి అకౌంట్ లో నుంచి దాదాపు రూ.50 వేలు సైబర్ నేరాలు కొట్టేశారు.

దిశ, ఘట్కేసర్ : జొమాటో యాప్ లో ఫుడ్ ఆర్డర్ చేసి క్యాన్సల్ చేసిన వ్యక్తి అకౌంట్ లో నుంచి దాదాపు రూ.50 వేలు సైబర్ నేరాలు కొట్టేశారు. ఈ ఘటన పోచారం ఐటీ కార్డు పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పోచారం మున్సిపాలిటీ వెంకటాపూర్ కి చెందిన కందుల వినోద్ (32) జూన్ 30వ తేదీన జొమాటో యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఆహారం ఆర్డర్ చేసి కొన్ని నిమిషాల తర్వాత ఆర్డర్‌ను రద్దు చేశాడు. కానీ డబ్బు తన ఖాతాకు తిరిగి రాలేదని జూలై రెండో తేదీన ఫిర్యాదుదారుడు జొమాటో కస్టమర్ కేర్ నంబర్‌ను వెతికి ఆ ఫోన్ నంబర్‌కు డయల్ చేశాడు. కస్టమర్ కేర్ నంబర్‌ను ఒక వ్యక్తి కాల్‌కు సమాధానం ఇచ్చి, తాను వాట్సాప్ కాల్ చేస్తానని చెప్పి కాల్‌ను ముగించాడు.
ఆ తర్వాత, ఫిర్యాదుదారుడికి వాట్సాప్ కాల్ రాగా బాధితుడు తన ఖాతాకు డబ్బు తిరిగి రాలేదని తెలియజేశాడు. అప్పుడు నిందితుడు లింక్ పంపుతానని, ఫోన్-పే పిన్, ఖాతా నెంబర్ చివరి నాలుగు అంకెలను నమోదు చేయమని సూచించాడు. బాధితుడు ఇచ్చిన వివరాల ఆధారంగా వివరాలను నమోదు చేయగానే సైబర్ నేరగాడు ఒకసారి రూ.47,643/-, మరొసారి రూ.2001/- మొత్తాన్ని ఫిర్యాదుదారుడి బ్యాంక్ ఖాతా నుంచి నొక్కేశాడు. వెంటనే తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోర్టల్‌లో అకౌంట్ నంబర్ ద్వారా ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటనలో తెలిపారు.






