- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కన్ను పడితే 'కన్నమే'.. తలుపులు పగలగొట్టి దొంగతనాలు
మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి గ్రామపంచాయతీలో గత కొద్ది రోజులుగా గుర్తు తెలియని దొంగలు గ్రామస్తులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.

దిశ కారేపల్లి: మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి గ్రామపంచాయతీలో గత కొద్ది రోజులుగా గుర్తు తెలియని దొంగలు గ్రామస్తులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. కిరాణా షాపులు, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ ఇండ్లను టార్గెట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. బాలుకిరాణంలో, పచ్చిపాల మంగమ్మ ఇంట్లో చొరబడి వస్తువులను ధ్వంసం చేసి విలువ చేసే వస్తువులు ఎత్తుకెళ్లారు. గుగులోత్ అరుణ ఇంటి కిటికీలను బద్దలు కొట్టి ఇంట్లో వస్తువులను ఆగం చేసి వస్తువులను ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి ఇంటి తలుపులను, కిటికీలను పగలగొట్టి ఇంట్లో సామాన్లు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా కిరాణా షాపులనే టార్గెట్ చేసి షాపు తాళాలు పగలగొట్టి షాపులో ఉన్నటువంటి అన్ని వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. దొంగలు సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు మొక్కులు చెల్లించడానికి వెళతారని ఆసరా చేసుకుని తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో జరుగుతున్న పరిణామాలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీస్ శాఖ తక్షణమే స్పందించి ఇలాంటి సంఘటనల పట్ల చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
ఈ ఘటనపై కారేపల్లి ఎస్ఐ బైరు గోపి వివరణ కోరగా..
ఇంతవరకు మాకు ఎవరు ఫిర్యాదు చేయలేదని.. దొంగతనం జరిగిందని విశ్వసనీయ సమాచారంతో ఘటన స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. బాధితులు ఫిర్యాదు చేస్తే నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.






