- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజాపూర్‌లో పేలిన ఐఈడీ.. జవాన్ దుర్మరణం, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
‘ఆపరేషన్ కాగార్’ (Operation Kagar)లో భాగంగా దేశంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు విస్తృతంగా కూబింగ్ ఆపరేషన్లు చేపడుతోన్న విషయం తెలిసింది.

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆపరేషన్ కాగార్’ (Operation Kagar)లో భాగంగా దేశంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు విస్తృతంగా కూబింగ్ ఆపరేషన్లు చేపడుతోన్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా భోపాల్‌పట్నం పీఎస్ పరిధిలోని ఉల్లూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్ర నేతలు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో డీఆర్జీ, సీఆర్‌పీఎఫ్ బలగాలు గత రెండు రోజులుగా జాయింట్ కూబింగ్ ఆపరేషన్ చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు, పోలీసులే లక్ష్యంగా చేసుకుని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ ఒక్కసారిగా పేల్చారు. ఆ భారీ విస్ఫోటనానికి ఓ డీఆర్జీ జవాన్ దినేశ్ నాగ్ అక్కడికక్కడే తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సహచర జవాన్లు వారికి ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే, కూబింగ్ ఆపరేషన్ ఆపే ప్రసక్తే లేదని బస్తర్ ఐజీ పి.సందర్‌రాజ్ వెల్లడించారు.






