- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక నేర నివేదిక విడుదల.. ఏకంగా 15శాతం తగ్గిన క్రైమ్ రేటు
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ (Hyderabad Police Commissionerate) పరిధిలో రిగిన నేరాలపై ఇవాళ సీపీ సజ్జనార్ (CP Sajjanar) వార్షిక నివేదికను విడుదల చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ (Hyderabad Police Commissionerate) పరిధిలో రిగిన నేరాలపై ఇవాళ సీపీ సజ్జనార్ (CP Sajjanar) వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2024-2025లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాలు 15 శాతం మేర తగ్గాయని తెలిపారు. తెలంగాణలోకి ఇతర రాష్ట్రాల నుంచి దోపిడీ గ్యాంగ్‌లు రావాలంటే భయపడుతున్నారని కామెంట్ చేశారు. నగరంలో ఎక్కడ దొంగతనం జరిగినా పట్టుకుంటారనే భావన, ఓ రకమైన భయం దొంగల్లో ఏర్పడిందని అన్నారు. ఇక సోషల్ మీడియాలో సైబర్ క్రైమ్‌పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. మరో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం (Enforcement Department) చాలా సమర్థంగా పనిచేస్తోందని సజ్జనార్ అన్నారు.
వార్షిక నివేదిక ప్రకారం నగరంలో మొత్తం నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2024లో 35,944 కేసులు నమోదైతే, 2025లో అవి 30,690కి తగ్గాయి. ఈ పరిణామంతో సుమారు 15 శాతం క్రైమ్ రేటు తగ్గినట్లుగా నివేదిక సూచిస్తోంది. ముఖ్యంగా క్రైమ్ రేటు తగ్గుదలకు ప్రధాన కారణం పోలీసు శాఖ చేపట్టిన కఠిన చర్యలు, తక్షణ FIR నమోదు విధానం, అధునాతన సాంకేతికత, ప్రజల సహకారమేనని సజ్జనాన్ అన్నారు. ఉన్నాయని నివేదిక తెలిపింది. గతంలో బీఎన్ఎస్, ఎస్ఎల్ఎల్ కేసులో 28,005 నుంచి 24,027కు 14 శాతం కేసులు తగ్గాయి. అదేవిధంగా శారీరక నేరాలు (Bodily Offences) 8,447 నుంచి 7,064కు 16 శాతం, సీరియస్ ఫిజికల్ క్రైమ్స్: 700 నుంచి 672కు 4 శాతం, కామన్ ఫిజికల్ అఫెన్సెస్ 7,747 నుంచి 6,392 17 శాతం, ఆస్తి సంబంధిత నేరాలు 5,328 నుంచి 3,817కు 28 శాతం, సీరియస్ ప్రాపర్టీ క్రైమ్స్ 315 నుంచి 217కు 31 శాతానికి కేసులు తగ్గినట్లుగా ఆయన వెల్లడించారు. ఇక నగర పరిధిలో సైబర్ నేరాలు 4,042 నుంచి 3,735కు అంటే 8 శాతం, మహిళలపై నేరాలు 2,482 నుంచి 2,625కు 6 శాతం, పిల్లలపై నేరాలు (POCSO) 449 నుంచి 568 అంటే 27 శాతం మేర కేసులు తగ్గినట్లుగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు.






