Hyderabad: ఆ ఐదు తుపాకులు ఎవరి కోసం..?

by Ajay Maddhiboyina |

బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హెయిర్ సెలూన్ దుకాణాలను నిర్వహిస్తున్న మహ్మద్ జీషన్ ఐదు తుపాకులను ఎవరి కోసం తీసుకొచ్చి ఉంటాడనే అంశంపై రాచకొండ పోలీసులు దృష్టి పెట్టారు.

Hyderabad: ఆ ఐదు తుపాకులు ఎవరి కోసం..?
X

దిశ, సిటీక్రైం : బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హెయిర్ సెలూన్ దుకాణాలను నిర్వహిస్తున్న మహ్మద్ జీషన్ ఐదు తుపాకులను ఎవరి కోసం తీసుకొచ్చి ఉంటాడనే అంశంపై రాచకొండ పోలీసులు దృష్టి పెట్టారు. పోలీసులకు అందిన సమాచారంతో జీషన్ అతని అనుచరుడు అమీర్‌ను అదుపులోకి తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ ఇప్పుడు ఆ తుపాకులను ఎవరి కోసం తీసుకువచ్చాడనే విషయం స్పష్టం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే గురువారం జీషన్, అమీర్‌ను అరెస్టు చేసిన పోలీసులు మరోసారి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. జీషన్ ను ఇప్పటి వరకు తుపాకులను ఉత్తర్ ప్రదేశ్ నుంచి తీసుకొస్తానని చెప్పి ఎంత మందికి చెప్పాడు? ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికి చెప్పాడు? అందులో క్రిమినల్ కేసుల్లో ఉన్న వారు ఎంత మంది? ఇలా ఇప్పుడు అనేక ప్రశ్నలకు పోలీసులు జవాబులు రాబట్టాల్సి ఉంది.

జీషన్ ఒకేసారి ఐదు తుపాకులను అక్కడ కొనుగలు చేసి తీసుకురావడం ఇప్పుడు కలకలం రేపుున్నది. 10 ఏండ్ల కిందట హైదరాబాద్‌కు కుటుంబంతో వచ్చిన జీషన్ మూడు హెయిర్ సెలూన్ దుకాణాలను ఏర్పాటు చేసి తన వ్యాపారాన్ని విస్తరించుకున్నప్పటికీ అక్రమ తుపాకుల వ్యాపారం చేయడానికి అతను విచారణలో పలు కారణాలు చెప్పాడు. అయినా అసలు కారణం వేరే ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక తుపాకీని రూ.2 లక్షలకు అమ్మాలని డిసైడ్ చేసుకున్న జీషన్ దగ్గర కొనుగోలు చేయాలనుకున్న వారికి ఎలాంటి క్రిమినల్ హిస్టరీ ఉందో, వారు ఎలాంటి కార్యకలాపాల కోసం వీటిని ఉపయోగించుకోవాలని చూస్తున్నారనే అంశాలు వెలుగులోకి రావల్సిఉంది. దీని కోసం ఇప్పుడు రాచకొండ పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. పోలీసుల అప్రమత్తతతో తుపాకులు అసాంఘిక కార్యకలాపాలకు నేరస్తుల చేతుల్లోకి వెళ్లకుండా ఆగిపోయాయి. కానీ వాటితో నేరాలు చేయాలనుకున్న ఆలోచనతో ఉన్న క్రిమినల్స్ గుట్టు బయటపడాల్సి ఉంది.

Next Story