- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధిక లాభాలు అని చెప్పగానే పెట్టుబడి పెడుతున్నారా?
సైబర్ నేరాలపై హైదరాబాద్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన 26 సైబర్ కేసుల్లో 37 మందిని అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: సైబర్ నేరాలపై హైదరాబాద్ పోలీసులు(Hyderabad City Cyber Crime Police) కఠినంగా వ్యవహరిస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన 26 సైబర్ కేసుల్లో 37 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం ఏడు రాష్ట్రాలకు చెందిన సైబర్ ముఠాలను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లో రూ.65 కోట్ల లావాదేవీలను గుర్తించారు. వీరికి దేశ వ్యాప్తంగా 86 కేసులతో సంబంధం ఉన్నట్లు నిర్ధారించారు. 26 సెల్‌ఫోన్లు, 79 సిమ్ కార్డులు, 62 క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఏ అనుమానం ఉన్నా 1930 నెంబర్ కాల్ చేయాలని సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్‌బాబు తెలిపారు. ఉన్నతాధికారుల పేర్లతో వచ్చే నకిలీ వాట్సాప్, సోషల్ మీడియా మెసేజ్‌లను నమ్మి డబ్బులు పంపొద్దు. అధిక లాభాల పేరుతో వచ్చే పెట్టుబడి స్కీమ్‌లకు దూరంగా ఉండాలి. బ్యాంకుల పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులు, ఏపీకే ఫైల్స్‌ను క్లిక్ చేయవద్దు. డిజిటల్ అరెస్ట్ కాల్స్‌కు భయపడవద్దు. సకాలంలో ఫిర్యాదు చేస్తే మోసపోయిన డబ్బును ఫ్రీజ్ చేసి తిరిగి పొందే అవకాశం ఉంటుందని పోలీసులు సూచించారు.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు జనవరిలో 117 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. అందులో అందులో 15 ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు, 2 డిజిటల్ అరెస్ట్ కేసులు, 4 సోషల్ మీడియా ఆధారిత పోక్సో కేసులు, 5 బిజినెస్, గేమింగ్, జాబ్ ఫ్రాడ్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేయడంతో బాధితులకు రూ.71.91లక్షలు రీఫండ్ చేశారు.






